Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారకాస్: వెనెజులా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మెక్సికోలో చర్చలు ప్రారంభం అయినాయి. ఈ చర్చలకు నార్వే మధ్య వర్తిత్వం తోడ్పడింది. ఆగస్టు 13 నుంచి 16 వరకు చర్చలు జరుగుతున్నాయని తెలియవస్తున్నది. చర్చలలో నాలుగు అంశాలు ఉంటాయని దేశాధ్యక్షుడు మదురో తెలియ చేశారు. వెనెజులా పై విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని,వెనెజులాలోని రాజ్యాంగ పర సంస్థలన్నింటిని గుర్తించాల ని, ప్రతిపక్షాల చేస్తున్న కుట్రలను నిర్ధ్వందంగా ఖండించాలని అన్ని ప్రతిపక్షాలను చర్చలలో బాగస్వామును చేయాలనే అంశాలపై చర్చిస్తామ ని తెలియజేసారు. చర్చల ద్వారా శాంతియుత వాతావరణం నెలకొని, అభివృద్ధి స్ధాధించాలని కోరుకుంటున్నట్టు అధ్యక్షుడు తెలియజేసారు.-