Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : హిరోషిమా నగరం, మూడు రాష్ట్రాల్లో అత్యున్నత అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం వుంటుందని జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి కారణాలతో ఈ ప్రాంతాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం వుంటుందని, ప్రజల్ని తరలించడానికి కూడా వీలు వుండకోవచ్చని హెచ్చరించింది. జపాన్లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాయవ్య జపాన్లోని సాగా, నాగసాకి, ఫుకోకా రాష్ట్రాల్లో శనివారం ఐదవ నెంబరు వాతావరణ హెచ్చరికను జారీ చేశారు.