Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా హౌం ల్యాండ్ భద్రతా విభాగం (డిహెచ్ఎస్) తీవ్రవాద హెచ్చరికను జారీ చేసింది. కోవిడ్ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించే అమెరికన్లు, జిహాదీ కార్యకర్తలతో సమానంగా దాడులు చేసే అవకాశం కనిపిస్తోందని హెచ్చరించింది. శుక్రవారం ఈ మేరకు డిహెచ్ఎస్ బులెటిన్ జారీ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక, హింసాత్మక తీవ్రవాదులు కోవిడ్ వేరియంట్లు తలెత్తడాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా తిరిగి విధిస్తున్న ప్రజారోగ్య నియంత్రణలు, ఆంక్షలను, దాడులను నిర్వహించడానికి ఒక అవకాశంగా చూస్తున్నారని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సామాజిక ఉద్రిక్తతలను, సమస్యలను పెంచుతోందని ఆ ప్రకటన తెలిపింది. దేశీయ తీవ్రవాదులు అనేక ఎత్తుగడలు పన్నుతున్నారని, దాంతో ఈ ఏడాది హింస మరింత పెరగవచ్చని హెచ్చరించింది. సెప్టెంబరు 11 దాడులను పురస్కరించుకుని చేసిన ఈ హెచ్చరికలు నవంబరు 11వరకు అమల్లో వుంటాయి. ఈ ఏడాది జనవరి 6న కేపిటల్‌పై దాడి నేపథ్యంలో దేశీయ తీవ్రవాదమే అత్యున్నత భద్రతా ముప్పుగా బైడెన్ ప్రభుత్వం పరిగణిస్తోంది.