Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబుల్ : ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుతం దారుణ మైన, అస్థిరత్వ పరిస్థితుల్లో ఉందని ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ దేశాన్ని కాపాడుకుంటామని, దీనికోసం అంతర్జాతీయ సమాజంతో చర్చలు జరుపుతామని అన్నారు. హింసను అడ్డుకోవడం, అస్థిరత్వాన్ని నివారించడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని చెప్పారు. దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించడాన్ని తాను అంగీకరించలేనని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సహించలేనని చెప్పారు. గత 20 ఏండ్లలో సాధించిన లక్ష్యాలను కోల్పోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు.భద్రతాబలగాలను,సెక్యూరిటీని తిరిగి సమాయత్తం చేయడమే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఘనీ చెప్పారు. దీనికోసం స్థానిక రాజకీయ నేతలతో పాటు,అంతర్జాతీయ సమాజంతో కూడా చర్చలు జరుపుతామని అన్నారు.దేశంలో శాంతిని నెలకొల్పడం కోసం శాయశక్తులా కృషి చేస్తామని ఘనీ పేర్కొన్నారు.మరోవైపు అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోయిన వెంటనే తాలిబన్లు ఆ దేశంలో మారణహౌమం సృష్టిస్తున్నారు.అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా రక్తపుటేర్లు పారిస్తూ దురాక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పట ికే రెండొంతుల దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆర్థిక రాజధాని కాందహా ర్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు దేశ రాజధాని కాబుల్‌ను చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే అష్రఫ్ ఘనీ రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ముగింపు పలుకుతూ దేశం కోసం తాను పోరాడతానంటూ ఆయన ప్రకటించారు. ఇక అంతర్జా తీయ సమాజం సైతం పౌరులపై తాలిబన్ల హింసను ఖండించారు. మరీ ముఖ్యంగా ఆఫ్ఘన్లో మహిళలు, బాలికల పరిస్థితిపై యూనిసెఫ్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాలిబన్లు హింసను ఆపాలి : ఐరాస
ఆఫ్ఘనిస్థాన్‌లో హింసాయుత పద్దతులతో తాలిబన్లు అక్కడి నగరాలను ఆక్రమించుకోవడాన్ని ఐక్య రాజ్య సమితి (ఐరాస) సెక్రెటరీ జనరల్ ఖండించారు. హింసను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఇప్పటికీ 60 శాతం ఆఫ్ఘన్ ప్రాంతాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో కాబుల్ తర్వాత అతిపెద్ద నగరాలైన కాందహార్, హీరాత్లను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. హింసాయుత పద్దతులలో స్వాధీనం చేసుకోవడం వల్ల యుద్ధ వాతావరణం మరింత కాలం కొనసాగే అవకాశముంది. మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు, స్వేచ్ఛను తాలిబన్లు మళ్లీ హరిస్తున్నారు. ఇవే విధానాలు కొనసాగితే అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘన్‌ను వెలివేసే అవకాశమున్నది. ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి యుద్ధ వాతావరణంలో జీవిస్తున్న ఆప్ఘన్ ప్రజలకు అవే కష్టాలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దురాక్రమణ ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే కాబుల్ కూడా తాలిబన్ల వశమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.