Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారాకస్: వెనిజులా ప్రభుత్వం, ఆ దేశ ప్రతిపక్షాల మధ్య చర్చలు మెక్సికోలో నార్వే మధ్యవర్తిత్వంలో ఆగస్టు 13న ప్రారంభం అయ్యాయి. ఈ చర్చలు సోమవారం వరకు జరగనున్నాయి. ఈ చర్చలకు వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు రాడ్రిక్స్ హాజరయ్యారు. ప్రధాన ప్రతిపక్షాలు సైతం హాజరయ్యాయి. చర్చల ప్రారంభానికి ముందు చర్చల ప్రక్రియ నియమ నిబంధనల గురించి ఒక అంగీకారానికి వచ్చి సంతకాలు చేశారు. చర్చలలో రాజకీయ హక్కులు, ఎన్నికల గ్యారంటీ గురించి, ఆంక్షల ఎత్తివేత, సమాజిక శాంతి పునరుద్ధరణ, విదేశాలలో చట్ట విరుద్ధంగా జప్తు చేసిన వెనిజులా సంపదను విడుదల చేయడం లాంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటు రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కుల అమలు, హింసాత్మక ఘటనలను ఖండించడం, ఇప్పటికే అంగీకరించిన అంశాల అమలు లాంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా నార్వే ప్రతినిధి మాట్లాడుతూ.. చర్చలు సఫలం కావడానికి అన్ని విధాల కృషి చేస్తున్నామంటూ పేర్కొన్నారు.