Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాబూల్ తాలిబాన్ల వశం
- అధికార బదిలీకి ప్రభుత్వంతో సంప్రదింపులు
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌కు తాలి బన్లు చేరుకున్నారు. దీంతో ఆ దేశంమొత్తం వారి హస్త గతమైంది. ఆ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. కీలక బృం దంతో కలిసి దేశం విడిచివెళ్లి నట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం తజికిస్తాన్‌కు వెళ్లిన అష్రఫ్, అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్లనున్నట్టు సమాచారం. ఇక అన్ని వైపుల నుంచి తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టినట్లు అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి మీడియాతో వివరించారు. అయితే అఫ్ఘాన్ సైన్యం, తాలిబన్లకు మధ్య కాల్పులు జరిగాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.కాబూల్‌పై తాలిబన్లు ఎలాంటి దాడి చేయలేదనీ, అధికార మార్పు శాంతి యుతంగా జరుగుతుందని అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. దీనికోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ శాంతియుతంగా ముగిసే వరకూ కాబూల్‌కు అన్ని ప్రవేశ మార్గాల వద్ద తాలిబన్ సైన్యం వేచి ఉంటుందని వెల్లడిం చారు. ఇదే సమయంలో అమెరికా రాయబార కార్యా లయం నుంచి తమ సిబ్బందిని ప్రత్యేక హెలికా ప్టర్‌లో తరలించింది. మరోపక్క తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలోని తాత్కా లిక ప్రభుత్వానికి అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పినట్టు ఇదివ రకే వార్తలు వచ్చాయి.కాగా అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పదవి నుంచి తప్పుకొని దేశం విడిచి వెళ్లనున్నారని రెండు రోజుల ముందునుంచే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో దేశప్రజలనుద్దేశిస్తూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.అఫ్గాన్ ప్రజల పై యుద్ధం ప్రకటించడాన్ని అంగీకరించనన్న ఆయ న..రెండు దశాబ్దాలుగా సాధించిన లక్ష్యాలను కోల్పో వడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. అంతేకా కుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్నీ సహించనని అష్రఫ్ ఘనీ పేర్కొన్నారు. కానీ,విస్తృత వేగంతో తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడంతో తప్ప ని పరిస్థితుల్లో అధికారాన్ని వదిలి.దేశాన్ని విడిచిపో యేందుకు అష్రఫ్ ఘనీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.