Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత స్వతంత్య్ర దినోత్సవం రోజున
- లండన్‌లో బ్యానర్లు
- 'కిసాన్ మజ్దూర్ ఏక్తా' అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన పలు సంస్థలు
లండన్: ఎన్నారైలు సహా వివిధ సంస్థలు భారత 75వ స్వతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలోనే లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 'కిసాన్ మజ్దూర్ ఏక్తా' అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. భారతీయ అన్నదాతలకు మద్దతు ప్రకటించారు. అలాగే, ఆదివారం ఉదయం పలువురు నిరసనకారులు సమావేశమై లండన్‌లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్‌కు ఎదురుగా ఉన్న వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జిపై 'రిజైన్ మోడీ' అని రాసి ఉన్న పెద్ద బ్యానర్‌ను ఆవిష్కరించి.. ఆ బ్రిడ్జిపై దానిని ప్రదర్శించారు. ''75వ స్వాతంత్య్రం నాటికి భారత్‌లో లౌకక రాజ్యాంగా లేకుండా పోయింది'' అని నిరసనకారుల్లో ఒకరు అన్నారు. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయనీ, వేలాది మంది సమాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిరంకుశ చర్యల కారణంగా జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. కరోనా వైరస్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది భారత ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలు, లౌకక రాజ్యాంగం, కరోనా నిర్వహణ లోపాలు, ప్రజా హక్కులను కాలరాయడం, మూకదాడులు వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ.. సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ సహా పలు సంస్థలు కలిసి 10 పాయింట్లతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేశాయి. అలాగే, నెదర్లాండ్స్‌లోని ది లండన్ స్టోరీ అనే ప్రవాస భారతీయుల నేతృత్వంలోని సంస్థ భారత స్వతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజస్వామ్య విలువల ప్రకటనగా పిలువబడే 'ఈయూ-ఇండియా పీపుల్స్' రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండటం అత్యంత ముఖ్యమైన విషయమనీ, ఇలాంటి వాటిల్లో చర్చలు కీలకంగా ఉండాలని పేర్కొన్నారు. లండన్ స్టోరీ రోడ్ మ్యాప్ వివరాలను యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందానికి సైతం తెలియజేసినట్టు సంబంధిత సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ రోడ్‌మ్యాప్‌లో డిజిటల్ డెమోక్రసీ, మానవ హక్కులు, వాతావ రణ మార్పులకు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణను చర్యలను పేర్కొన్నారు.