Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోర్టు అవు-ప్రిన్స్ : హైతీ భూకంప విషాదంలో మృతుల సంఖ్య ఆదివారం నాటికి 1,297కు చేరింది. మరో 5,700 మందికి పైగా గాయపడ్డారని దేశ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది. ఇంకా శిథిలాల కింద చిక్కుకొనివున్న వారికోసం వెతుకులాట కొనసాగుతోందని తెలిపింది. హైతీ నైరుతి ప్రాంతంలో శనివారం రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. విపత్తు తీవ్రతతో నేపథ్యంలో స్థానిక ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు. కొత్త ప్రకంపనలు సంభవిస్తాయేమోనన్న ఆందోళనతో అనేక మంది ఆదివారం తమ ఇళ్ల బయటే రాత్రంగా నిద్రలేకుండా గడిపిన పరిస్థితులు నెలకొన్నాయి. కూలిన భవనాల శిథిలాలను తరలించే యంత్రాలతో వీధులన్ని నిండిపోయాయి. అదేవిధంగా తమవారి అచూకీ కోసం బాధితుల బంధువులు శిథిలాల కింద నిశ్శబద్ధంగా వెతుక్కుంటున్న విషాదకర దృశ్యాలు కనిపించాయి. శిథిలాల నుంచి బయటపడిన మార్సెల్ ఫ్రాంకోయిస్ అనే వ్యక్తి సోదరుడు జాబ్ ఫ్రాంకోయిస్ మాట్లాడుతూ శిథిలాల కింద చిక్కుకుపోయాను.. కాపాడాలని నా సోదరుడి నుంచి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు.