Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని తాలిబాన్లకు అప్పగించేసింది: రష్యా
మాస్కో: రష్యా, చైనా బలమైన శక్తిగా ఎదగడంతో అమెరికా ఆధిపత్యం పడిపోనారంభించిందనిౖ రష్యన్ అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రత్యేక దూత జమీర్ కబులోవ్ వ్యాఖ్యానించారు. తాలిబాన్లకు కాబూల్ దాసోహం అనడం రాజకీయ వ్యూహంలో భాగం కాదు, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా జోక్యందారీ విధానాల వైఫల్యం. అమెరికా ఆధిపత్యం బలహీన పడుతోంది అని మధ్య ఆసియా వ్యవహారాలపై పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ సోమవారం మాస్కో రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అస్తవ్యస్థ ఘటనలు అమెరికా వ్యూహంలో భాగమేనన్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చేసిన యత్నమే తప్ప మరొకటి కాదు. ఆదివారం అమెరికా ఎంబసీ భవనం పై కప్పు ఎక్కిన సిబ్బందిని హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిన దారుణమైన పరిస్థితి అమెరికాకు ఎదురైంది.