Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాలిబన్ల పిలుపు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదనీ, దానిమీద కసరత్తు జరుగుతున్నదని తాలిబన్లు ప్రకటించారు. అదే సమయంలో క్షమాబిక్ష ప్రకటించారు. ముస్లిం నాయకులతో ప్రభుత్వం ఏర్పడాలని, కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో మహిళలు చేరాలని పిలుపునిచ్చారు.ఇతర దేశాల దౌత్యశౄఖ సిబ్బంది, పౌరులను తరలించే విమానాలు నడుస్తున్నాయనీ, విమానాశ్రయంలో సోమవారం నాటి గందరగోళ పరిస్థితి తగ్గినట్టు తెలుస్తున్నది. విమానాశ్రయంవద్ద జరిగిన తోపులాట, ఘర్షణలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, రాబోయే రెండు రోజుల్లో గంటకో విమానం చొప్పున బయలుదేరి దేశం విడిచి వెళ్ళాలనుకునే వారిని తరలిస్తారని తెలుస్తున్నది. తాలిబన్ల కీలక నాయకుడు ముల్లా బారాదార్ కందహార్ చేరుకున్నారు. ఆయన తాలిబన్ల వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు నమ్మిన అనుచరుడు.