Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్ వైఫల్యంపై పశ్చిమ దేశాల కన్నెర్ర
- మౌనం పాటిస్తున్న చైనా, రష్యా
కాబూల్ : అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా వైదొలగకముందే తాలిబన్లు అత్యంత వేగంగా, విజయవంతంగా దేశాన్ని ఆక్రమించుకోగలిగారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా వున్నారు. ఇదంతా అమెరికాకు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తోంది. మరోవైపు 20ఏండ్ల సుదీర్ఘమైన యుద్ధాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించి అమెరికా బలగాలు దేశం నుంచి వైదొలిగిన నేపథ్యంలో చాలా వేగంగా పరిస్థితులు క్షీణించడం పట్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దశాబ్దాలుగా సాగిన యుద్ధంలో అమెరికాకు సహకరించిన బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అమెరికా మిత్రపక్షాలన్నీ అసంతృప్తిని, నిరాశను, ఆందోళనలను వెలిబుచ్చాయి. చైనా, రష్యాలు మాత్రం మౌనం పాటించాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తాలిబన్లకు ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు గుర్తింపు లభిస్తుంది, వారు ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకుంటారని చైనా విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. తమదే గుత్తాధిపత్యం అన్నట్లుగా వ్యవహరించే అమెరికా ప్రతిష్ట, ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర వైఫల్యంతో దెబ్బతింది. విలువలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు, మానవ హక్కుల సాకుతో ఇతర దేశాలకు అల్లర్లు, గందరగోళాన్ని ఎగుమతి చేయగల సామర్ధ్యం అమెరికాకు ఇప్పటికీ వుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆఫ్ఘన్లో ప్రస్తుత పరిస్థితుల నుండి ప్రజల గుణపాఠాలు నేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. తాలిబన్లు అనూహ్యమైన విజయాలు సాధించినందున చైనా ప్రస్తుత పరిస్థితులను మౌనంగా పరిశీలించడమే అవసరమని చైనాలోని రెన్మిన్న వర్శిటీలో అంతర్జాతీయ అధ్యయనాల సంస్థ అసోసియేట్ డీన్ జిన్ కన్రోంగ్ వ్యాఖ్యానించారు.న అంటే దానర్ధం తాలిబన్లకు అపారమైన సైనిక శక్తి వుందని అర్ధం కాదని, ఆఫ్ఘన్ ప్రభుత్వ బలగాలు నైతిక స్థైర్యం కోల్పోయారని అర్ధమని అన్నారు. రాజకీయ బాధ్యతలను కూడా తాలిబన్ చేపట్టాల్సిన అవసరం వుందని అన్నారు.