Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: తాలిబన్లకు అమెరికా షాకిచ్చింది. 9.5 బిలియన్ డాలర్ల అఫ్ఘన్ ద్రవ్య నిల్వలను స్తంభింపజేస్తూ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాంకుకు చెందిన సుమారు 9.5 బిలియన్ డాలర్ల నిధులను తాలిబన్లు యాక్సెస్ చేయకుండా, ఆ దేశానికి బదిలీ కాకుండా నిరోధించారు. ఈ చర్య ఫలితంగా, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న, 'ప్రత్యేక నియమిత జాతీయుల' జాబితాలో ఉన్న తాలిబన్లు, యుఎస్‌లో ఉన్న ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను యాక్సెస్ చేయలేరని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది.-