Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌలాలంపూర్ : మలేషియా ప్రధానిగా ఇస్మాయిల్ సాబ్రి యాకూబ్‌ను ఆ దేశపు రాజు శుక్రవారం నియమించారు. వీలైనంత త్వరలో ఇస్మాయిల్ సాబ్రి పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో విజయం సాధించాల్సి వుంటుందని రాజు ప్రకటించారు. తగిన మెజార్టీ లేకపోవడంతో ప్రధాని పదవి నుంచి ముహైద్దీన్ ఈ వారంలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ముహైద్దీన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇస్మాయిల్ సాబ్రి ఉప ప్రధానిగా పని చేశారు. ప్రధానిగా ఇస్మాయిల్ సాబ్రిని నియమించడంతో, మలేషియా లో గ్రాండ్ఓల్డ్ పార్టీ అయిన యునైటెడ్ మలయస్ నేషనల్ ఆర్గనైజే షన్ (యుఎంఎన్ఓ) మళ్లీ అధికారంలోకి వచ్చినట్లయింది. 2018 సాధారణ ఎన్నికల్లో యుఎంఎన్ఓ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.