Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: తాలిబన్ల వ్యవస్థాపకు లలో ఒకరు ప్రస్తుత కీలక నాయకుడు ముల్లా బారాదర్ కాబూల్ చేరుకున్నారు. ఆయన దోహాలోని తాలిబన్ల రాజకీయ ప్రధాన కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఇతర దేశాలు, సంస్థలతో చర్చలు జరిపే బాధ్యతలు కీలకం నిర్వహిస్తుంటారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతోంది.కలీల హక్కాని, గులబుద్దాన్ హేక్మెత్తార్ కూడా కాబూల్ చేరుకున్నారు. అమెరికా గులబుద్దిన్ తలకు ఐదు కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించి ఉన్నది. వీరు రేపు ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. కొత్త ప్రభుత్వంలో పాత ప్రభుత్వంలో కీలకశాఖలు నిర్వహించిన వారికి చోటు కల్పించే అవకాశం కూడా ఉన్నది. ఆర్థిక శాఖ, అంతర్గత భద్రతలాంటి శాఖల నిర్వహణ కోసం బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.తాలిబన్లు తమ నడక మారిందని, వేధింపులు ఉండవని చెప్పినా ప్రజలు నమ్మడం లేదనేది అర్థం చేసుకుని ప్రజలలో తమ పట్ల విశ్వాసం పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర దేశాల దౌత్య కార్యాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది, పౌరులు దాదాపు ఇప్పటికే 14000 మందిని తాలిబన్ల సహకారంతో విమానాలలో తరలివెళ్ళినట్టు తెలుస్తున్నది. ఇంకా మిగిలి ఉన్న వారిని కూడా పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి.మాజీ అధ్యక్షుడు ఖర్జాయి, అంతర్గత మంత్రిగా ఉన్న అబ్దుల్లా అబ్దుల్లా ప్రస్తుతం కాబూల్ తాత్కాలిక గవర్నను కలిసి ప్రస్తుత పరిస్థితి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు.అఫ్ఘనిస్థాన్‌లో భయం, ఆందోళన సర్వత్ర వ్యాపించి ఉన్నాయి. అయితే కింది స్థాయిలోని తాలిబన్లు వేధిస్తున్నారనే వార్తలు వస్తుంటే, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సీనియర్ నాయకులు తెలుపుతున్నారు.