Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలో పెద్దఎత్తున నిరసనలు
- ప్లకార్డులు..బ్యానర్లు..పోస్టర్లతో నినాదాల హౌరు
సిడ్నీ.: కరోనా కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి తరలివచ్చారు. ఫ్లకార్డులు..బ్యానర్లు..పోస్టర్లు పట్టుకుని శనివారం ప్రదర్శనలు నిర్వహించారు.
మెల్బోర్న్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. భారీసంఖ్యలో ఉన్న నిరసనకారుల్ని అడ్డుకొనేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వీటిని దాటి ముందుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నిం చారు.నిరసనకారులను కట్టడి చేయటానికి పోలీసులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. కొన్ని చోట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించా రు.ఆందోళనకారుల పీకల్ని నొక్కే ప్రయత్నం చేయగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు పోలీసులు, అటు నిరసనకారులు గాయపడ్డారు. సుమారు 200 మందికిపైగా అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రెండు మాసాలుగా సిడ్నీలో లాక్డౌన్ కొనసాగుతున్నది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెల్బోర్న్, కాన్బెర్రా నగరాల్లోనూ ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో పాటు భౌతికదూరం పాటించాలంటూ ప్రభుత్వం నిబంధనలు విధించింది.