Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు పెంచటంతో పాటు అసమానతలను అంతం చేయండి..
- డెన్మార్క్ సర్కార్‌కు అభ్యుదయవాదుల విన్నపం
- దేశంలోనే అతిపెద్ద సమ్మె.. 60 రోజులకుపైనే కొనసాగుతున్న నిరసనోద్యమం
కోపెన్హాగన్: డెన్మార్క్‌లో నర్సుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతున్నది. దేశంలోనే అతిపెద్ద సమ్మె అనీ, 60 రోజులకుపైగా నిరసనోద్యమం కొనసాగుతున్నది. మానవతా ప్రయోజనాల దృష్ట్యా అధికారంలో ఉన్న సంకీర్ణప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రగతిశీల రాజకీయ గ్రూపులు కోరుతున్నాయి. నర్సుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డానిష్ రీజియన్ బోర్డ్‌లోని ఎన్హెడ్స్లిస్టెన్ (రెడ్-గ్రీన్ అలయన్స్), సోషలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎస్ఎఫ్) ప్రతినిధులు ఉన్నారు.
వేతనాల పెంపుతో పాటు వేతన వ్యత్యాసాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ, డానిష్ నర్సుల కౌన్సిల్ (డీఎస్ఆర్) నేతృత్వంలో జూన్ 19 నుంచి దేశ వ్యాప్తంగా 5000 మందికి పైగా నర్సులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న నర్సులు, వారి మద్దతుదారులు కోపెన్‌హాగన్‌లోని క్రిస్టియన్బోర్గ్ కోట స్క్వేర్ వద్ద ఇటీవల భారీ ప్రదర్శన నిర్వహించారు, తమ డిమాండ్లను పరిష్కరించాలని పునరుద్ఘాటించారు. అపష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేదాకా పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆగస్టు 20 నాటికి సమ్మె 63 వ రోజుకు చేరుకున్నది, ఇది డెన్మార్క్‌లో సుదీర్ఘమైన నర్సుల సమ్మెగా నిలిచింది.
ఏప్రిల్ 2021 లో, డానిష్ నర్సుల కౌన్సిల్ (డీఎస్ఆర్), మునిసిపాలిటీలతో 2021-2024 సామూహిక ఒప్పంద ప్రతిపాదనను తిరస్కరించాయి. సమ్మెకు వెళ్లి..డిమాండ్లతో కదంతొక్కాలని నిర్ణయించాయి. మేలో సయోధ్య ప్రయత్నాలకు యూనియన్ మద్దతు ఇచ్చినప్పటికీ, నర్సింగ్ యూనియన్ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. జూన్‌లో మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించారు జూన్ 19 న సమ్మె మొదలైంది.
డిమాండ్లు ఇవే..
- వేతనాల పెంపును కాలపరిమితితో పెంచాలనీ, కోవిడ్ -19 కాలంలో అదనపు శ్రమను గుర్తించాలనీ, ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలనీ నర్సుల యూనియన్ ప్రధానమైన డిమాండ్. నర్సింగ్, ఇతరత్రా మహిళా ఆధిపత్య వృత్తుల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది.
- డెన్మార్క్ నర్సుల సమ్మెకు ఆ దేశంలో ఉన్న ట్రేడ్ యూనియన్లు, గ్రీస్‌లోని ఆల్ వర్కర్స్ మిలిటెంట్ ఫ్రంట్ (పీఎఎంఈ), యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ నర్స్ అసోసియేషన్ (ఈఎఫ్ఎన్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ డెన్మార్క్ (కేపీ), ఇతర కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపింది. నార్వేజియన్ నర్సెస్ అసోసియేషన్లు మద్దతు తెలిపాయి.