Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరలింపులో భాగంగా కాబూల్ నుంచి భారత్కు వచ్చిన ఆఫ్ఘన్ ఎంపి నరేంద్ర సింగ్ ఖల్సా కొంత ఉద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతటి పెట్టుకున్నారు. భారత్ తనకు రెండో ఇల్లు వంటిదని పేర్కొంటూ.. కాబూల్ ఎయిర్పోర్టు చేరుకునేందుకు ఎదురైన భయానక పరిస్థితులను వివరించారు. కుటుంబంతో కలిసి ఎయిర్పోర్టుకు వెళ్తున్న సమయంలో తాలిబన్లు తమను ఆధీనంలోకి తీసుకున్నారని, పిల్లలుండడటంతో అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నామని తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి తమ దేశానికి వెళ్తామన్నారు.