Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా ఖండించిన మంత్రి రోడ్రిగ్జ్
హవానా : క్యూబాకు చెందిన ఉన్నతాధికారులపై ఆమెరికా విధించిన కొత్త ఆం క్షలను ఆ దేశ విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ తీవ్రంగా ఖండించారు. ఆంక్షలు విధించేందుకు అమెరికాకు నైతిక అధికారం లేదని ఆయన అన్నారు. క్యూబాపైన, క్యూబన్లపైన నిరంతర దాడి చేసేందుకు, ఆర్థిక దిగ్బంధనాన్ని మరింత పెంచేం దుకు అమెరికా అత్యుత్సాహం చూపుతోందని విమర్శించారు. ఈ నిరంకుశ వైఖరిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. జనరల్ స్టాఫ్ రెండవ చీఫ్, ఎఫ్ఎఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ అధ్యక్షుడు రాబర్టో లెగ్రాతో పాటు చీఫ్ ఆఫ్ సెంట్రల్ ఆర్మీ చీఫ్ ఆండ్రెస్ లౌరానో గొంజాలెజ్, డైరెక్టరేట్ ఆఫ్ పెనిటెన్షియరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అధ్యక్షుడు అబెలార్డో జిమెనెజ్ల పేర్లను ఆంక్షల జాబితాలో చేరుస్తూ అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ప్రకటన చేసింది.