Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దక్షిణాసి యాలో పర్యటిస్తున్నారు. అప్ఘనిస్థాన్ పరిణామాల కంటే ముందే ఈ పర్యటన ఖరారు అయింది. అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యాల ఉపసంహరణ, మనుషులు తరలింపు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికా అనాలోచితంగా ఉపసంహరణ విధానాన్ని రూపొందించినందుకే ఈ గందరగోళం జరుగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అయితే కమలా హారిస్ మాత్రం ప్రస్తుతం మేము ప్రజల తరలింపుపై కేంద్రీకరించి ఉన్నాము. సైనిక ఉపసంహరణ మంచి, చెడుల గురించి తరువాత చర్చించుకోవచ్చునని అంటున్నారు. ఆమె ఇప్పుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు.కమలా మాట్లాడుతూ ఈ ప్రాంతంపై మాకు ఆసక్తి ఉన్నది ఇక్కడ పరిణామాలను మేము ఎప్పటికప్పుడు గమనిస్తున్నాము. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం పట్ల మాకు బాధ్యత కూడా ఉన్నదని స్పష్టం చేశారు.