Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సచ్ ఇంటర్వ్యూ
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణ గురించి మీరేమంటారని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, పరిశోధకుడు జెఫ్రీ సచ్ను సిసిటిఎన్ టీవి చానెల్ అడగ్గా దీనికి ఆయన చాలా సూటిగా, పదునుగా జవాబిచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
కీలకమైన ఈ అంశాన్ని వదిలిపెడితే మిగతా వాటిలో బైడెన్ ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వ విధాన వారసత్వాన్ని తీసుకెళ్లేందుకు ఎందుకు ఇష్టపడడం లేదు.
ఇది చాలా ఆశ్చర్యం గొలిపే అంశం. నువ్వు ఒక లక్ష కోట్ల డాలర్లు ఇతర దేశంలో ఖర్చు చేస్తే, దాని నుంచి ఏదో కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తావు. అది మౌలిక సదుపాయాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ. చేపట్టే విధానపరమైన మార్పులకు ప్రజల నుంచి మద్దతు కూడగట్టే విషయంలో కానీ. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా ఖర్చు చేసింది. మిలిటరీ విధానం కోసం లక్ష కోట్ల డాలర్లు తగలేసింది.అమెరికా ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయి. వారు వాగ్దానం చేసిన ఆసుపత్రులు ఎక్కడీ స్కూళ్లు ఎక్కడీ రోడ్లు ఎక్కడీ సురక్షిత శిశు జననాలు ఎక్కడీ దురదృష్టకరమైన అంశమేమిటంటే వీటిలో వేటికీ అమెరికా వీసమెత్తు సాయం కూడా చేయలేదు. ఆప్ఘనిస్తాన్‌లోని అమెరికా తొత్తు ప్రభుత్వమూ ఆ పని చేయలేదు. ఎందుకంటే అమెరికా దృష్టంతా సైనిక జోక్యం పైనే. బలప్రయోగాన్ని అభివృద్ధి యత్నంగా చూడలేము. మిలిటరీ యత్నం ద్వారా ప్రజల మద్దతు చూరగొనలేము. దీనికి ప్రజల్లో ఎలాంటి విశాల మద్దతు లేదు. అందుకే అది అక్కడి నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. తాలిబాన్లు కూడా దీని కోసమే ఎదురు చూశారు.
లక్ష కోట్ల డాలర్లు తగలేసి ఆఫ్ఘన్ నుంచి తిరిగి వెనక్కి వచ్చేశారు కదా. దీనిపై మీరేమంటారు?
అమెరికా కోణం నుంచి దీనిని వివరించే యత్నం చేస్తా. ఇది ఎంత తెలివితక్కువ తనమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 20 ఏళ్లు కాదు, 40 ఏళ్లు అయినా చివరికి జరిగేది ఇదే.
ప్రొఫెసర్ సచెస్ మీ వైఖరి రాజకీయంగా కరెక్టుకాదని మీ దేశంలోనే చాలా మంది అనుకుంటారు. అయినా, మీరు ఈ విషయాలను అంత దైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
అందుకు నా వయసు ఒక కారణం కావచ్చు. నా వయసు ఇప్పుడు 41 ఏళ్లు. అదీ గాక నేను ప్రపంచం అంతటా పనిచేస్తున్నాను. వియత్నాంలో ఏం జరిగిందో చూశా. కంబోడియాలో వినాశనాన్ని చూశా. మధ్య అమెరికాలో అమెరికా జోక్యాన్ని చూశా. మనం రెండు గల్ఫ్ యుద్ధాలను చూశాం. అమెరికా ఏ విధమైన కోవర్టు ఆపరేషన్లకు పాల్పడిందీ చూశాం. సిరియాను ఎలా నాశనం చేసిందీ చూశాం. వీటన్నిటిలో నా దేశం వ్యవహరిస్తున్న తీరు నన్నెంతగానో బాధిస్తున్నది.
ప్రొఫెసర్‌గారూ మరో ప్రశ్న. మీరు ఎందుకు పాత కాలపు భావనను ఇంగ్లీష్‌లో వ్యక్తం చేస్తున్నారు?
మీరు ఎప్పుడైనా సుత్తి పట్టారా? సుత్తి పట్టుకుంటే ప్రతిదానిని మేకులా మీరు చూస్తారు.అమెరికా శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. ప్రతిదానికీ యుద్ధమే పరిష్కారం అన్నట్టుగా చూస్తుంది. బల ప్రయోగాన్ని అమెరికా తన విదేశాంగ విధానంగా మార్చేసింది. అమెరికాకు నిర్దిష్టంగా ఒక విదేశాంగ విధానమంటూ ఏదీ లేదు. మధ్య ప్రాచ్యంలో మిలిటరీని ఉపయోగించాం. ఇరాక్‌లో, సిరియాలో అదే పని చేశాం. మధ్య అమెరికాలో మిలిటరీని ఉపయోగించాం. వియత్నాంలో మిలిటరీని ఉపయోగించాం. కంబోడియాలో, లావోస్‌లో ఉపయోగించాం. ఎక్కడా అది పనిచేయలేదు.
ఇవన్నీ మళ్లీ తలెత్తుతున్నాయంటే దీని వెనక ఏదో లాజిక్కు వుండాలి కదా. వీటన్నిటిని నడిపించే అంశమేమిటంటారు?
దీని వెనక కొందరి ప్రయోజనాలు తప్పక దాగి వుంటాయి. అవి ప్రయోజనాలు రూపంలో ఉండొచ్చు. అవినీతి పరులైన కాంట్రాక్టర్ల రూపంలో ఉండొచ్చు. మిలిటరీ పరిశ్రమ సముదాయం ప్రయోజనాలై ఉండొచ్చు. ఫలానాది అని కచ్చితంగా చెప్పలేను. మొట్టమొదటి అంశం. దీనిని ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. చరిత్ర, భౌగోళిక శాస్త్రం గురించి, చారిత్రిక ఘట్టాల గురించి అమెరికన్లు ఎప్పుడూ తెలుసుకోరు. తెలుసుకునే ప్రయత్నమూ చేయరు. అలాగే మిగతా ప్రపంచం గురించి కూడా. రెండవ అంశం అమెరికా సమాజం అంతా ఇలా ఉందని నేను అనను. ఇతర సంస్కృతులను అమెరికా తృణీకరిస్తుంది. దాని ఫలితంగా మీకంటూ విలువలు ఉండవు. విజయానికి అవసరమైన జ్ఞానం ఉండదు. కానీ, మీ దగ్గర ఒక శక్తివంతమైన సుత్తి ఉంది. ఇది చేసే పని మేకులను దిగ్గొట్టడమే. అంటే దీనర్థం ఇతర దేశాలను బాదడమే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బయటకు రావడంలో విజయమంటూ ఏమీ ఉండదు. ఇదొక విషాదం. అత్యంత మతిమాలిన చర్య. ఆఫ్ఘనిస్తాన్‌లో అసలేం జరుగుతుందో అమెరికన్లకు పట్టదు.
మీకు మాత్రమే పట్టినట్టుంది!
ఒకటి మాత్రం స్పష్టం. ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం లేనిదేదీ విజయవంతం కాదు.