Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్: జర్మనీలో ట్రైన్ డ్రైవర్స్ రెండు రోజుల సమ్మె ప్రారంభం అయింది. ఈ నెలలో ఇది రెండో సమ్మె జీతాలు 3.2 శాతం పెంచాలని కరోనా బోనస్ నలభైతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని ప్యాసింజర్ రైళ్ళలలోని డ్రైవర్స్ ఎక్కువ శాతం సమ్మెలో ఉన్నారు. సరుకులు రవాణా చేసే రైళ్లలో సమ్మె ప్రభావం తక్కువగా ఉన్నది. ప్రయివేటు రైళ్ళ సిబ్బంది సమ్మెలో లేరు.జీతాలు ఎంత పెంచాలి, ఈ పెరుగుదల ఎప్పటి నుంచి అమలు జరపాలి. ఒప్పందం కాల పరిమితి లాంటి అంశాలపై యాజమాన్యం చాలా మొండిగా ఉండటంతో ఒకే నెలలో 48 గంటల సమ్మె రెండు సార్లు చేయాల్సి వచ్చింది, అని యూనియన్ నాయకులు చెపుతున్నారు.