Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లుసాక: జాంబియాలో ఇప్పటి వరకు ప్రముఖ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న హిచిలేమా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనారు. హిచిలేమాను ముద్దుగా హెచ్‌హెచ్ లేక బల్లె అంటే తండ్రి అని అర్థం వచ్చేలా పిలుస్తారు. ఆయన జాతీయ అభివృద్ధి ఐక్యతా పార్టీకి అధ్యక్షుడు హిచిలేమా ఆరు సార్లు పోటీ చేసినా ఈసారి గెలిచారు. 10 లక్షల ఓట్ల మెజారిటీ గెలిచారు. ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రం అవ్వడం, పరిమితమైన స్వేచ్ఛ మాత్రమే ఉండడంలో ప్రజలు మార్పును కోరుకున్నట్టు తెలుస్తున్నది కకోనా రాక ముందే దేశ జనాభాను సగం మంది దారిద్ర రేఖకు దిగువనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ద్రవ్యోల్భనం 24 శాతం పెరగడంతో ప్రజలు జీవించడమే కష్టం అయిపోయింది.