Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబుల్ : అమెరికా తొత్తు ప్రభుత్వం ఓడిపోయినట్లు చేతులెత్తేయగానే దేశ ఆస్తులన్నిటిని స్తంభింపజేయడంతో ఆప్ఘనిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమైంది. కాబూల్‌ను వశపరచుకున్న వెంటనే తాలిబాన్లు సెంట్రల్ బ్యాంకు, ది బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నదీ ఆరా తీయగా 900 కోట్ల డాలర్లు ఉన్నట్లు తేలింది. 3.9 కోట్ల జనాభా కలిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు 3,500 కోట్ల డాలర్ల అంతర్జాతీయ రిజర్వు నిధులున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అత్యంత పేద దేశంగా తయారవడానికి అమెరికా ఇరవై ఏళ్ల దురాక్రమణపూరిత యుద్ధం, వనరుల లూటీయే ప్రధాన కారణం. ఎస్‌డిఆర్ (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) కింద ఐఎంఎఫ్ ఇటీవలే 65వేల కోట్ల డాలర్లు మంజూరు చేసింది. అయితే, తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించేది లేనిది తేలేంతవరకు ఈ రుణ సాయాన్ని నిలిపివేయాలని ఐఎంఎఫ్ నిర్ణయించింది. యుద్ధం, విధ్వంసంతో తీవ్రంగా దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఐఎంఎఫ్ నిధులు నిలిపేసి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే స్థితివైపు నెట్టింది. మరో వైపు అమెరికా బ్యాంకులు, ఫైనాన్స్సంస్థల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సొమ్మును బైడెన్ ప్రభుత్వం స్తంభింపజేసి తాలిబాన్లపై ఒత్తిడి పెంచుతున్నది.