Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి 1000ం కేసులు..
సిడ్నీ: పటిష్టమైన కరోనా లాక్డౌన్ అమలు చేస్తూ ఇన్నాళ్లు కేసులు పెరగకుండా జాగ్రత్త పడిన ఆస్ట్రేలియాకూ ఇప్పుడు కరోనా కాకపుట్టిస్తున్నది. తాజాగా ఆ దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సిడ్నీలో ఆస్పత్రుల వద్ద అత్యవసర టెంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ మొదలయ్యాక.. ఈ స్థాయిలో ఆస్ట్రేలియాలో కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 47,700 పాజిటివ్ కేసులు, 989 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా 16 ఏండ్లు పైబడిన 32 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 54 శాతం మంది ప్రజలు ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ అక్కడ లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా... కనీసం 70 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తయితే గానీ లాక్డౌన్ను సడలించే ఉద్దేశమేదీ లేదని ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరోనా బుసలు కొట్టడం గమనార్హం.న్యూ సౌత్ వేల్ రాష్ట్రం నుంచే 1029 కేసులు వెలుగుచూశాయి. ఒక్క సిడ్నీ నగరంలోనే ఈ సంఖ్య 969గా ఉన్నది. దీంతో సిడ్నీ నగరం ఇప్పుడు కోవిడ్ విజృంభణకు ప్రధాన కేంద్రంగా మారింది. డెల్టా వేరియంట్ వల్ల ఈ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. రోగుల తాకిడిని తట్టుకునేందుకు వీలుగా అక్కడి ఆస్పత్రులు ఆరుబయట టెంట్లు ఏర్పాటు చేశాయి. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాలైన మెల్బోర్న్, కాన్బెర్రాల్లో కూడా కఠిన లాక్డౌన్ అమలవుతున్నది. అక్కడా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.