Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చరించిన బైడెన్
- ఐఎస్‌పై దాడులు కొనసాగిస్తామని ప్రతిన
వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్ గ్రూపుపై వైమానిక దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రాబోయేఏ 24-36 గంటల్లోగా మరో దాడి జరిగే అవకాశం చాలా ఎక్కువగా వుందని హెచ్చరించారు. నిర్దిష్టమైన, విశ్వసనీయమైన ముప్పు వుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఉదయం కొత్తగా సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. మంగళవారంతో బలగాల తరలింపునకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో నాలుగువేల మంది కన్నా తక్కువగానే అమెరికా బలగాలు వున్నాయని పెంటగాన్ ప్రకటించింది.