Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలెం : ఇజ్రాయిల్ వైమానిక దళాలు మరోసారి గాజాపై విరుచుకుపడ్డాయి.ఆదివారం తెల్లవారు జామున గాజాలోని రెండు ప్రాంతాలపై ఇజ్రాయిల్ వైమానిక బలగాలు బాంబు దాడులకు తెగబడ్డాయి. సరిహద్దుల్లో బలగాలతో ఘర్షణ పడిన గాజా పౌరులు దక్షిణ ఇజ్రాయిల్‌పై రసాయనాలతో కూడిన బెలూన్లు ప్రయోగించినందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ తన చర్యను సమర్థించుకునే యత్నం చేసింది. హమాస్ స్థావరాలను టార్గెట్‌గా చేసుకుని ఈ దాడులు జరిపామని ఇజ్రాయిల్ చెబుతోంది.కానీ, ఈ దాడుల్లో ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయి. జబాలియాకు పక్కనే గల సొరంగ మార్గంపైన బాంబు దాడి జరిగిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం గురించి ఇంకా సమాచారం అందలేదు.