Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగింపు దశకు అమెరికా ఉపసంహరణ క్రమం
కాబూల్ : కాబూల్ విమానాశ్రాయనికి సమీ పంలో సోమవారం రాకెట్లు పడ్డాయి. ఎవరు వీటిని ప్రయోగించారనే విషయం వెంటనే తెలియరాలేదు.. కాబూల్‌లోని సలీమ్ కార్వాన్ ఏరియాలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ వెంటనే తుపాకుల పేలుళ్లు వినిపించాయని చెప్పారు. కానీ ఎవరు కాల్పులు జరిపారో స్పష్టం కాలేదు. కాగా మరోవైపు ఆఫ్ఘన్ నుండి అమెరికా వైదొలగే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మూడు పేలుళ్ళ శబ్దాలు వినిపించాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆకాశంలోకి మాంసం ముద్ద ఎగరడం చూశామని చెప్పారు. పేలుళ్లు వినపడడంతో ప్రజలు అక్కడ నుండి పారిపోయారు. దీనిపై వ్యాఖ్యానించమని కోరగా అమెరికా అధికారులు వెంటనే స్పందించలేదు. రాకెట్ దాడుల అనంతరం కూడా అమెరికా మిలటరీకి చెందిన కార్గో విమానాలు తమ తరలింపులను కొనసాగించాయి. వాహనం వెనుక వైపు నుండి రాకెట్ దాడి జరిగిందని ఆఫ్ఘన్ మీడియా తెలిపింది. కాబూల్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు రాకెట్లు పడ్డాయని పజ్వాక్ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడి గురించి అధ్యక్షుడు బైడెన్‌కు తెలియచేసినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. సరైనా ప్రయాణ పత్రాలతో వున్న వారిని దేశం వీడి వెళ్లడానికి అనుమతించాల్సిందిగా తాలిబన్ల నుండి హామీ పొందినట్లు ఆదివారం అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై నాటో, యురోపియన్ యూనియన్ సహా దాదాప వంద దేశాలు సంతకాలు చేశాయి. మంగళవారం అమెరికా ఉపసంహరణ పూర్తయిన తర్వాత సాధారణ ప్రయాణాలను అనుమతిస్తామని తాలిబన్లు తెలిపారు. విమానాశ్రయంపై నియంత్రణను తాము తీసుకుంటామన్నారు.