Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: బంగ్లాదేశ్ రెడిమెడ్ దుస్తుల తయారీ పరిశ్రమలో భద్రత ఏర్పాట్లపై గతంలో ఉన్న అగ్రీమెంటును కొనసాగిస్తూ తాజాగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రెండు సంవత్సరాలకు వర్తిస్తుంది. దీని ప్రకారం ఏమైనా ప్రమాదం జరిగితే యజమాని నష్ట పరిహారం చెల్లించాలి. అలా కాని పరిస్థితిలో రీటెల్ సంస్థ ఆ బాధ్యత పూర్తి చేయాల్సి ఉంటుంది.మొదటి సారి జరిగిన ఒప్పందాన్ని బంగ్లాదేశ్ అంగీకారం అని పిలుస్తున్నారు. అది ఈ నెల 31న ముగియనున్నది. తాజాగా ఒప్పందం సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నది. ఈ ఒప్పందాన్ని ''జౌళీ రెడీమేడ్ పరిశ్రమలో ఆరోగ్య, భద్రతకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం'' అని పిలుస్తారు. ఈ ఒప్పందంపై సుమారు 200 రిటైల్ సంస్థలు సంతకం చేసాయి.2013లో రాణాప్లాజా అనే సంస్థలో జరిగిన ప్రమాదంలో 1100 మంది రెడిమెడ్ దుస్తులు కుట్టే కార్మికులు చనిపోయారు. అప్పుడు కార్మికుల భద్రత గురించి ఒక ఐదు సంవత్సరాల కాలపరిమితి గల ఒప్పందం జరిగింది. దాని ఫలితంగా 20 లక్షల కార్మికులు పని చేసే 1600 సంస్థలలో కార్మికులకు పని స్థలాల్లో భద్రకు హామీ లభించింది. వాల్మార్ట్ మాత్రం గత ఒప్పందం, ఇప్పటి ఒప్పందంతో తనకి సంబంధం లేదని ప్రకటించింది.