Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు భారతీయ ఖైదీలను అప్పగించిన పాక్
లాహోర్ : అక్రమంగా సరిహద్దును దాటడంతో ఎనిమిది సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైల్లో ఉంచిన ఇద్దరు భారతీయులను వాఘా సరిహద్దు వద్ద భారత్కు చెందిన సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బందికి అప్పగించినట్లు పాక్ ప్రభుత్వ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. 2013లో శర్మ రాజ్పుత్, రామ్ బుహదార్ అనే ఇద్దరు భారతీయులు కాశ్మీర్ నుంచి నియంత్రణ రేఖ(ఎల్ఒసి) దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించడంతో వారిని పాకిస్తాన్ రేంజర్లు అరెస్టు చేశారని అధికారి తెలిపారు. తరువాత వారు మానసిక వికలాంగులిగా తేలారని, అనుకోకుండా సరిహద్దును దాటినట్లు చెప్పారు.వీరికి సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని భారత్తో పంచుకున్నామని, ఇద్దరిని భారత్ తమ పౌరులిగా నిర్ధారించడంతో రేంజర్లు వారిని సోమవారం బిఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారని పాక్ అధికారి పేర్కొన్నారు. సంవత్సరం క్రితం గూఢచర్యం, అక్రమంగా సరిహద్దు దాటడం వంటి ఆరోపణలపై పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేసిన 19 మంది భారతీయుల కేసులు ఇప్పటికీ ఫెడరల్ రివ్యూ బోర్డ్ వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. పాక్ భద్రతా చట్టం, రహస్య సేవల చట్టం కింద ఈ పంతొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు దేశంలోని పలు జైళ్లలో ఉంచారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఈ కేసులపై ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు వారి నిర్బంధాన్ని పొడిగిస్తున్నట్లు ఫెడరల్ రివ్యూ బోర్డు ఇటీవల పేర్కొంది.