Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా సేనలు ఉపసంహరణ తరువాత తాలిబన్ నాయకులు తమ ఫైటర్లను ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. ''మీ త్యాగాలను చూస్తుంటే గర్వంగా ఉన్నది. మీరు ఎంతో శ్రమించడంతో మనకు ఈ విజయం దక్కింది. మన నాయకుల నిజాయితీ, సహనాన్ని కూడా మనం మరిచిపోకూడదు.'' అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా అన్నారు. ముఖ్యంగా అఫ్ఘాన్ ప్రజలను మీరంతా గౌరవించాలి. ప్రజలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ దేశం ఎన్న బాధలు పడింది. ఇక్కడి ప్రజలు ఎంతో వేదన అనుభవించారు. నేడు వారిని మనం ప్రేమించాలి. వారి పట్ల సానుభూతితో నడుచుకోవాలి. అందుకే వారిని గౌరవించండి. మనం వారి సేవకులం మన పాలన వారిపై బలవంతంగా రుద్దుతున్నట్టు ఉండకూడదు. అధికారం మారేటప్పుడు, మొదట్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. మనం కొత్త ఇల్లు మారినప్పుడూ అదే జరుగుతుంది. అయితే అంతా నిమ్మదిగా సర్దుకుంటుంది''. అని ఆయన అన్నారు.