Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారులకు పొంచిఉన్న డెల్టా వేరియంట్ ముప్పు
వాషింగ్టన్: అగ్రదేశం అమెరికాలోని ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు డెల్టా వేరియంట్ పడగవిప్పుతుంటే ...మరోవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తున్నది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలోని ఫ్లొరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆస్పత్రుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నదని అక్కడి వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రిజర్వ్ చేసిన ఆక్సిజన్ వాడాల్సిన ప్రమాదం పొంచి ఉండగా.. మరికొన్ని చోట్ల పూర్తిగా నిండుకునే పరిస్థితి ఉన్నదని వైద్యులు అంటున్నారు. దక్షిణ అమెరికాకు చెందిన పలు రాష్ట్రాలు రిజర్వ్ ఆక్సిజన్‌ను వినియోగించే పరిస్థితి చేరుకోవడంతో స్థానికుల్లో కలవరపెడుతున్నది.