Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రయివేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిల్వలు కూడా అడగంటడంతో.. సరుకు దిగుమతులకు కూడా సమస్య ఏర్పడింది. శ్రీలంక లో డబ్బు విలువ తీవ్రంగా పడిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగి పోతు న్నాయి. ఈ పరిస్థితిని అదుపుచేయడానికి అధికారులు నిత్యవసర సరుకుల సరఫరాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బియ్యం, చక్కెర, చింతపండు లాంటి సరుకుల ధరలను నియంత్రించాలని అడుగులు వేస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీలంక రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 7.5 శాతం విలువను కోల్పోయింది. ఓ మాజీ సైనికాధికారికి పూర్తిగా అధికారాలు ఇచ్చి నిత్యావసర సరుకుల నియంత్రణ బాధ్యతలు అప్పగించారు. ఆయన అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటారు. ఈ విభాగానికి చెందిన స్థానిక ప్రభుత్వ అధికారులు నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందించే బాధ్యతను నిర్వహిస్తారని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్ష తెలియజేశారు.