Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి అయిన తరువాత తాలిబన్ అధికార ప్రతినిధి ముజాయిద్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరిదీ ఈ విజయమన్నారు. అఫ్ఘాన్‌లో ఉన్న వివిధ గ్రూపులు కలసి రావాలని అప్పుడే దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధికి అందరూ కృషి చేయాలి. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు నిర్భయంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వారికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. గత బాధకర చరిత్ర ముగిసిందని కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు. మన దేశాన్ని ఒక సేచ్ఛాయుత దేశంగా నిర్మించాలి. అందరి సహకారాన్ని తీసుకొని పరస్పర సహకారంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇతర దేశాల అంతర్గత విషయాల్లో మేం జోక్యం చేసుకోబోం. మా దేశంలో కూడా ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నాం. శాంతి, సహకారం కోసం మీ ముందుకు వస్తున్నామని మీరు అలానే స్పందించాలని కోరుకుంటున్నామని తాలిబన్ ప్రతినిధి ముజాయిద్ చెప్పారు.