Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరించిన నేపథ్యంలో యూఎస్ రక్షణ మంత్రి, తాలిబన్ల ప్రతినిధి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలు..
ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకుంటాం : లాయడ్ ఆస్టిన్
వాషింగ్టన్: యుద్ధం ముగిసిందని అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ ప్రకటించారు. యుద్ధంలో మరణించిన ప్రతి ఒక్కరిని అమెరికా గుర్తుంచుకుంటుందని తెలిపారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునేవరకూ కృషి చేస్తామని చెప్పారు. ఉపసంహరణ ప్రక్రియ చాలా పెద్ద కార్యక్రమం అని దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నారు. 1,24,000 మందిని విమానాలలో తీసుకువచ్చామని ఇది భారీ ఉపసంహరణ కార్యక్రమమని తెలిపారు. యుద్ధంలో అమెరికా తరుఫున పోరాడిన ప్రతిదేశానికీ కృతజ్ఞతలు తెలిపారు. 20 సంవత్సరాల కాలంలో దుబాషీలుగా సహకరించిన ఆఫ్ఘనిస్థానీయులకు పూర్తి రక్షణ, పునరావాసం ఏర్పాటు చేస్తామన్నారు.