Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురి మృతి, 20 మందికి గాయాలు
కరాచీ :పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. నిషేధిత 'తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి)' అనే సంస్థకు చెందిన ఒక సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్న ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని మస్తుంగ్ రోడ్లో ఉన్న ఫ్రంటియర్ కార్ప్స్(ఎఫ్‌సి) చెక్‌పోస్టు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ క్వెట్టా అజార్ అక్రమ్ పేర్కొన్నారు.గాయపడిన వారిలో ఎఫ్సికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, బలూ చిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఈ ఫ్రంటియర్ కార్ప్స్ ప్రధానంగా ఉందని అన్నారు.మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ఘటనతో ఆఫ్ఘనిస్తాన్‌లో దాక్కున్న టిటిపి తిరుగుబాటుదారులను నియంత్రించేందుకు పాకిస్తాన్ తాలిబాన్ల వైపు చూస్తున్నందున కాబూల్‌లో ప్రభుత్వ మార్పు ఆ దేశ కష్టాలను అంతం చేయకపోవచ్చన్న భయంకరమైన సంకేతాన్ని పంపినట్లైందని విశ్లేషకులు భావిస్తు న్నారు. దాడి ఘటనను ట్విట్టర్ ద్వారా ఖండించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మృతుల కుటుంబ సభ్యులకు, బాధితులకు సానుభూతి తెలిపారు.