Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్‌లో భారీ ఆందోళనలు
పారిస్ : కోవిడ్-19 హెల్త్‌పాస్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో వేలాదిమంది పౌరులు రోడ్లెక్కారు. హెల్త్‌పాస్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో శనివారం భారీయెత్తున ఆందోళనలు జరిగాయి. ఒక్క పారిస్‌లోనే దాదాపు 18 వేల మందికి పైగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ ఆగేయ ప్రాంతంలోని బౌలేవార్డ్ సెయింట్ మార్సెల్ ద్వారా డిలా బస్టిల్లే ప్యాలెస్ వరకు ర్యాలీ చేశారు. హెల్త్‌పాస్ ప్రజల హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని, తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, స్పోర్ట్స్ స్టేడియాలు, జిమ్‌లతో సహా ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లాలంటే ఫ్రాన్స్‌లో ఈ కోవిడ్-19 హెల్త్‌పాస్ తప్పనిసరిగా ఉంది. వ్యక్తి పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నాడని, తాజా పరీక్షలో నెగటివ్ తేలిందని, ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్నారని ఈ హెల్త్‌పాస్ చూపిస్తుంది.