Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులకు కోవిడ్ సాయంపై సందిగ్దం...
- ఇప్పటికే నిలిపివేసిన పలు రాష్ట్రాలు
వాషింగ్టన్: అమెరికాలో లక్షలాది మంది నిరుద్యుగులకు అందుతున్న కరోనా సహాయం త్వరలోనే ముగియనుంది. దీనిని ఆర్థిక నిపుణులు సైలెంట్ క్రైసిస్గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. ఈ క్రమంలోనే అమెరికా ఆ దేశ ఆర్థిక, సామజిక ప్రజా పరిస్థితులు దిగజారకుండా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులోకి సామాన్య ప్రజానీకం నుంచి వివిధ కంపెనీలకు ఆర్థికంగా సహాయం లభించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఆ దేశం ఆర్థికంగా కుదేలు కాకుండా జాగ్రత్తపడింది. ఈ చర్యలతో అంతర్జాతీయంగా అమెరికాకు ప్రశంసలు సైతం లభించాయి. అయితే, ప్రస్తుతం ఆ దేశంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు అందుతున్న ప్రభుత్వ సాయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో నిరుద్యోగ సహాయాన్ని భారీగా విస్తరించిన అమెరికాలో త్వరలోనే ఆ ప్రయోజనాలు ముగియనున్నాయి. కరోనా సమయంలో వీరిలో చాలా మంది పనిలేకుండా ఉన్నారు. ఇప్పటికే పని లభించని వారు సైతం ఎక్కువగానే ఉన్నారు. దీంతో వారి జీవితాలు ముందుకు సాగే పరిస్థితులపై వారు ఆందోళనలో ఉన్నారు. దీనికి తోడు అక్కడ డెల్టా వేరియంట్ విస్తరణతో వారు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, ఇది సైలెంట్ క్రైసిస్ అంటూ అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. నిరుద్యోగులకు అందిస్తున్న ఈ సహాయ కార్యక్రమాలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. గడువు కంటే ముందుగానే పలు రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను ముగించాయి. దీంతో నిరుద్యోగులపై ఒత్తిడి నెలకొంది. ''ఇది ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రశంసించబడని సంఘటనగా నేను భావిస్తున్నాను'' అని థింక్ ట్యాంక్ ది సెంచరీ ఫౌండేషన్‌కు చెందిన ఆండ్రూ స్టెట్నర్ అన్నారు. రిపబ్లికన్ పార్టీలో చాలామంది మొదట ఈ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వగా, ఈ సంవత్సరం నాటికి వారి చట్టసభ సభ్యులు వారికి వ్యతిరేకంగా వాదిస్తున్నారు. చాలా మంది రిపబ్లికన్ గవర్నర్లు, వాటిని పూర్తిగా లేదా పాక్షికంగా ప్రారంభంలోనే ముగించాలని భావించారు. మహమ్మారి కారణంగా కోల్పోయిన 3 మిలియన్ల ఉద్యోగాలు ఇంకా పునరుద్దరించడలేదని తాజా ప్రభుత్వ డేటా పేర్కొంది.