Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్లోరిడా : మతి స్థిమితం లేని ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఒక మహిళ, ఆమె మూడు మాసాల చిన్నారి కూడా వున్నారు. ఈ కాల్పుల్లో 11ఏళ్ళ బాలిక తీవ్రంగా గాయపడిందని చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత ఆ వ్యక్తి సెంట్రల్ ఫ్లోరిడాలోని పోలీసులకు లొంగిపోయాడని పోల్క్ కౌంటీ షరీఫ్ గ్రేడీ జూద్ పత్రికా సమావేశంలో తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తిని అమెరికా మాజీ సైనికుడు బ్రియాన్ రిలే (33)గా గుర్తించారు. గాయపడిన బాలికకు తీవ్రంగా ఏడు చోట్ల గాయాలవడంతో వెంటనే ఆపరేషన్ చేశారు. బాధితులకు రిలేకు ఎలాంటి సంబంధం లేదు. తనకైన తుపాకీ గాయానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిలే పోలీసు అధికారి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నించాడు. వారిపై కాల్పులు జరిపేందుకు యత్నించాడని పోలీసు అధికారి జూద్ చెప్పారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల్లో అమెరికా జరిపిన యుద్ధాల్లో సైనికుడిగా పనిచేసినన రిలే ప్రస్తుతం బాడీగార్డ్‌గా, సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటుతో బాధ పడుతున్నాడని రిలే స్నేహితురాలు తెలిపింది. వారం క్రితం రిలే మానసిక ఆరోగ్యం మరింత దెబ్బతింది. దేవుడితో మాట్లాడుతున్నానంటూ తన స్నేహితురాలికి తెలిపాడని జూద్ చెప్పారు.