Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికాలో దానా పరిశ్రమ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.ఈ పరిశ్రమలో కార్లకు కావాల్సిన విడి భాగాలను ఉత్పత్తి చేస్తారు.ఆ పరిశ్రమలో కొత్త కాంట్రాక్ట్ విధానాన్ని యాజమాన్యం ప్రతిపాదిస్తున్నది.ఆ విధానాలను యూనియన్లు కూడా బలపరుస్తున్నాయి.దాంతో కార్మికులే పూనుకుని సమ్మె కమిటీలు ఏర్పాటు చేసుకుని సమ్మెకు సిద్ధం అవుతున్నారు. సమ్మెపై కార్మికుల అభిప్రాయ సేకరణకు రహస్య బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం ఆరు కేంద్రాలలో అత్యధిక కార్మికులు సమ్మెకు అనుకూలంగా ఓటు వేశారు. కొత్త నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఓవర్టైం పని చేయ్యాలి, వారానికి 80 గంటలు పని చేయాలి. జీతాల కోతను అంగీకరించాలి, అనేవి కొన్ని షరతులు, వీటిని కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. యూనియన్ నాయకులు కార్మికులపై తీవ్ర ఒత్తిడి చేసి 'సమ్మె'ను జరగకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.