Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కోవిడ్‌బారిన పడి చనిపోయినవారి సంఖ్య ప్రభుత్వం చూపుతున్న లెక్కలకంటే.. కోటిన్నర మంది అదనంగా చనిపోయినట్టు ఎకనామిస్టు పత్రిక ఒక నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ లెక్కలు 46 లక్షల మంది మాత్రమే చనిపోయినట్టు తెలుపుతున్నాయి. కోవిడ్‌తో చనిపోయినవారిలో చాలా మంది.. రోగ లక్షణాలు భయటపడకుండానే మృతిచెందారు. ప్రభుత్వలెక్కల్లో వారి ప్రస్తావన ఉండదు. ఆస్పత్రులు రోగులతో నిండి పోవడంతో కనీస వైద్యం కూడా అందక చాలా మంది చనిపోయారు. వారి ప్రస్తావన కూడా ప్రభుత్వ లెక్కల్లో లేదు. గతేడాది జులై నెల లెక్కలు పరిశీలిస్తే ఈ విషయాలు భయటకు వస్తున్నాయని ది ఎకనామిస్ట్ పత్రిక తెలిపింది. పెట్టుబడిదారీ దేశాలకు ప్రమాదం గురించి ముందస్తుగానే జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో పని చేస్తున్న సంస్థలు హెచ్చరికలు చేసినా అవి పట్టించుకోలేదు. కార్మికులను పనిలోకి రావాలని ఒత్తిడి చేసాయి తప్ప వారి భద్రతకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పెట్టిబడిదారులు విపరీతంగా ఈ మహమ్మారి కాలంలో లాభాలు సంపాదించుకున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మరణాల గురించి ప్రభుత్వం ఇచ్చిన లెక్కట కంటే వాస్తవ మరణాలు 700 నుంచి 800 శాతం ఎక్కువ ఉన్నట్టు తెలుస్తున్నది. లాటిన్ అమెరికాలో కూడా మరణాలు ఎక్కువ ఉన్నట్టు ఆ పత్రిక తెలియజేసింది.