Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యశుద్ధిలేని యుద్ధం
న్యూయార్క్ : 2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం) 110అంతస్తుల రెండు భవనాలను అల్ ఖైదా తీవ్రవాదులు రెండు విమానాలతో ఢకొీట్టించి కూల్చివేశారు. దాదాపు 3000మంది అక్కడికక్కడే మంటల్లో, శిథిలాల కింద మృతిచెందారు.బిన్‌లాడెన్ నాయకత్వంలోని అల్‌ఖైదా తీవ్రవాదులు ఆ రోజు ఉదయం నాలుగు విమానాలను హైజాక్‌చేసి వాటితో వరల్డ్ ట్రేడ్ సెంటర్,పెంటగాన్,వైట్‌హౌస్‌పై దాడి చేయటానికి పథకం సిద్ధం చేసుకున్నారు.పథకం ప్రకారం ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పూర్తిగా కూల్చివేశారు. పెంటగాన్‌పై దాడి చేసినా భవనంలోని కొంతభాగం మాత్రమే ధ్వంసమైంది. మరో విమానం లక్ష్యం చేరకుండా మార్గమధ్య లోనే కూలిపోయింది. ఈ దాడిలో 18మంది ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారు.అమెరికా ఈ దాడిని సాకుగా చూపి ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధానికి పూనుకున్నది. బిన్‌లాడెన్ దాక్కున్నా డనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ నెల ఆగస్టు 31న తన సైన్యాలను అక్కడి నుంచి ఉపసంహరించుకున్నది. ఈ యుద్ధం కోసం దాదాపు రెండు లక్షల కోట్ల డాలర్లను అమెరికా ఖర్చుచేసింది. మూడు లక్షల మంది ఆఫ్ఘన్లకు సైనిక శిక్షణ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్పై పూర్తిస్థాయి యుద్ధం జరిపి దాదాపు రెండు లక్షల మందిని చంపింది.అదేవిధంగా ఉగ్రవాదంపై యుద్ధం అనే పేరుతో అమెరికా, నాటో సభ్యదేశాలు జరిపిన ఆరు యుద్ధాలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది చనిపోయారు. మూడు కోట్ల ఎనభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు ఖర్చుచేశారు. 20 సంవత్సరాల కాలంలో అమెరికా ఆరు యుద్ధాలకు ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్,లిబియా లాంటి దేశాలలో పాల్పడింది.ఈ మొత్తంలో కొంతమంది ఉగ్రవాద నాయకులు చనిపోయినా ఉగ్రవాదం అంతం కాలేదు.అదే ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు అధికారాన్ని అప్పగిం చి ఓటమి అంగీకరించింది. ప్రపంచవ్యాపితంగా రక్తపాతం, అశాంతి ప్రబలింది. మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మాత్రం ఆయుధాలు అమ్ముకుని లాభాలు సంపాదించింది. సామ్రాజ్యవాదం లాభాల కోసం యుద్ధాన్ని ఒక సాధనంగా వాడుకుంటుందనేది మరోసారి రుజువైంది.