Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్ది పొందనున్న మెజారిటీ భారతీయ ఐటీ నిపుణులు
వాషింగ్టన్ : అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకునేందుకు ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త బిల్లు ఆమోద ముద్ర పొందినట్లైతే అదనపు ఫీజు చెల్లించడం ద్వారా అమెరికాలో చట్టబద్ధంగా వుండొచ్చు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు కోసం అమెరికాలో ఏండ్ల తరబడి లక్షలాదిమంది వేచిచూస్తున్నారు. వీరిలో భారతీయుల సంఖ్య గణనీయంగా వుంది. ప్రతిపాదిత బిల్లు చట్టరూపం దాల్చితే వీరందరి ఆశలు నెరవేరుతాయి. దీనివల్ల వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులు లాభపడతారని భావిస్తున్నారు. ఉద్యోగం నిమిత్తం ఇక్కడకు వచ్చి రెండేండ్ల కన్నా పై నుంచి నివాసముంటున్నటైతే 5వేల డాలర్లు అదనపు ఫీజు చెల్లించడం ద్వారా ఎలాంటి పరిమితులు లేకుండా శాశ్వతంగా నివాసముండవచ్చునని అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ విడుదల చేసిన డాక్యుమెంట్ పేర్కొంది. ఈబీ-ఎస్ కేటగిరీ (ఇమ్మింగెట్ ఇన్వెస్టర్లు) వారికి ఈ ఫీజు 50వేల డాలర్లుగా వుంటుంది. 2031లో ఈ నిబంధనలకు కాలం చెల్లుతుందని ఫోర్బ్స్ మేగజైన్ పేర్కొంది. కుటుంబం ప్రాతిపదికన వుండే ఇమ్మిగ్రెంట్లకు గ్రీన్ కార్టు రావాలంటే 2500 డాలర్లు చెల్లించాల్సి వుంటుంది. దరఖాస్తుదారుని ప్రాధాన్యతా తేది రెండేళ్ళలోపు లేకుంటే, కానీ దేశంలో వుండాల్సిన అవసరం వుంటే వారు 1500డాలర్లు చెల్లించాల్సి వుంటుంది. దరఖాస్తుదారు చెల్లించే పాలనాపరమైన ప్రాసెసింగ్ ఫీజుకు ఈ ఫీజు అదనంగా వుంటుంది. అయితే చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు శాశ్వత వ్యవస్థాగతమైన మార్పులేవీ ఈ బిల్లులో లేవు. అంటే గ్రీన్ కార్డులకు పరిమితులు తొలగించడం, లేదా హెచ్-1బి వీసాల వార్షిక కోటాలను పెంచడం వంటి చర్యలేవీ తీసుకోలేదు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చాలంటే జ్యుడీషియరీ కమిటీ, ప్రతినిధుల సభ, సెనెట్లు ఈ నిబంధనలను ఆమోదించాల్సి వుంది. అధ్యక్షుడు సంతకం చేయాల్సి వుంటుంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే ఎలాంటి పత్రాలు లేని ఇమ్మిగ్రెంట్లు అంటే పిల్లలుగా అమెరికాకు వచ్చినవారు, తాత్కాలిక రక్షిత హౌదా (టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్-టిపిఎస్)లబ్దిదారులు, వ్యవసాయ కూలీలు, కరోనా కాలంలో వచ్చిన ఇతర వర్కర్లు వీరందరూ కూడా శాశ్వతంగా అమెరికాలో నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.