Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృతీయ దేశాలను లక్ష్యంగా చేసుకునే యత్నాలను మానండి
- క్వాడ్ సదస్సుపై చైనా వ్యాఖ్యలు
బీజింగ్ : త్వరలో జరగనున్న క్వాడ్ సదస్సుపై చైనా మంగళవారం విమర్శలు చేసింది.ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇలా బృందా లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రజాదరణ పొందవని, భవిష్యత్ కూడా వుండదని వ్యాఖ్యానించింది.ఈ నెల 24న అమెరికా అధ్యక్షతన వాషింగ్టన్లో క్వాడ్ సదస్సు జరగనుంది.భారత ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగాలు హాజరు కానున్నారు.దేశాల మధ్య సహకారం తృతీయ పక్షాలను లక్ష్యంగా చేసుకోరాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ వ్యాఖ్యానించారు.''ప్రాంతీయ సహకారం చట్రపరిధి అనేది కాలానుగు ణంగా వుండాలి.ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర విశ్వాసానికి, సహకారా నికి అనుకూలంగా వుండాలని చైనా విశ్వసిస్తుంది.అంతేకానీ తృతీయ దేశాలను లక్ష్యంగా చేసుకోరాదు,వారి ప్రయోజనాలకు హాని కలిగించరా దు.''అని ఆయన పేర్కొన్నారు.ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థికాభి వృద్ధికి చైనా చోదక శక్తిగా మాత్రమే కాదు, శాంతి పరిరక్షణలో ప్రధాన శక్తిగా కూడా వుండాలని కోరుకుంటున్నామని చెప్పారు.చైనా అభివృధ్ధి చెందడమనేది ఈ ప్రాంతానికి మంచి వార్త అని, మొత్తంగా ప్రపంచంలో శాంతి కాముకుల పాత్ర పెరగడమేని అన్నారు.సంబంధిత దేశాలన్నీ ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వాన్ని, సంకుచిత స్వభావంతో కూడిన భౌగోళిక, రాజకీయ శతృత్వ భావనను విడనాడాల్సి వుందన్నారు. సరిగా ఆలోచి స్తూ, ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, ప్రాంతీయ సంఘీభావానికి, సహకారానికి అనుగుణంగా మరిన్ని చర్యలు చేపట్టాల్సి వుందన్నారు.