Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓస్లో: నార్వేలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో జోనస్ స్టోర్ నాయకత్వంలోని వామపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలలో వాతావరణ మార్పుపై చర్యలు తీసుకోవాలనేది ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. లేబర్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడంతో ప్రజలు దాన్ని ఆధరించారు.169 సీట్లు ఉన్న పార్లమెంట్లో లేబర్ పార్టీ దాని మిత్రపక్షాలకు 100కు మించి సీట్లు వచ్చి పూర్తి మెజారిటీ సాధించింది. ప్రస్తుతం లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న జోనస్ స్టోర్ ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్నది. ఇతర మిత్ర పక్షాలతో కొత్త ప్రభుత్వం కూర్పు గురించి చర్చలు ప్రారంభం అయినాయి.