Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైఫిడో: మయన్మార్లో నోబుల్ బహుమతి గ్రహిత సూకీపై నాలుగు అవినీతి కేసుల విచారణ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. నాలుగు కేసులూ అక్రమంగా బనాయించినవే. ఈ కేసులలో ప్రతిదానికి 15 సంవత్సరాల జైలు శిక్ష వేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సూకీ వయస్సు 76 సంవత్సరాలు. ఆవిడపై దొంగ సాక్ష్యాలు పెట్టి శిక్షను ఖరారు చేసి నిర్భందిస్తే ప్రజలకు ఆవిడ కనపడకుండా చేయవచ్చని భావిస్తున్నారు. మయన్మార్లో జరిగిన ఎన్నికలలో సూకీ పార్టీ ప్రజాస్వామ్యం కోసం జాతీయ సంస్థ పూర్తి మెజారిటీతో గెలిచింది. ఆ ఎన్నికలను సైన్యం అంగీకరించ కుండా సూకీపై తప్పుడు కేసులు పెట్టి గృహ నిర్భందంలో పెట్టంది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు పూనుకున్నారు. పోలీసు కాల్పులలో కొంత మంది చనిపోయారు.