Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఆరవ దశ లాక్డౌన్ విధించడంతో మెల్బోర్న్ , సిడ్నిలలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ ఎత్తివేయాలని నిరసనలకు పూనుకున్నారు. పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. రెండు వైపులా అనేక మందికి త్రీవ గాయాలు అయినాయి. మెల్బోర్న్లో 235 మందిని, సిడ్నిలో 32 మంది నిరసన కార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి 85,000 కేసులు నమోదు అయినాయి. 1145 మంది కరోనా బారిన పడి చనిపోయారు. పదహారు సంవత్సరాల వయస్సు దాటిని వారిలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే వరకు లాక్డౌన్ కొనసాగుతుందని అనధికారికంగా తెలుస్తున్నది.