Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టూనిస్ : అదనపు అధికారాలను చేపట్టిన కైస్ సయిద్ చర్యను నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. తిరుగుబాటును వెనక్కు తీసుకోవాలని, చట్టబద్ధంగా వ్యవహరించాలంటూ టూనిస్లో వేలాది మంది నినాదాలు చేస్తూ... భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రజలు పార్లమెంటును రద్దు చేయాలని కోరుకుంటు న్నారంటూ సయిద్ మద్దతుదారులు ఎదురుదాడికి దిగారు. హబీబ్ బౌర్గుయిబా అవెన్యూలో భారీ పోలీస్ బందోబస్తుతో ఈ నిరసన జరిగింది. జులై 25న పార్లమెంట్‌ను రద్దు చేయడం, కార్యనిర్వాహక అధికారం చేపట్టడం ప్రధానిని తొలగించడం అనంతరం సయిద్ చర్యలను నిరసిస్తూ చేపట్టిన మొదటి నిరసన ప్రదర్శన కావడం గమనార్హం.