Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాబుల్‌లో మహిళా ఉద్యోగులపై ఆంక్షలు..
కాబుల్: అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళల హక్కులపై ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే క్యాబినెట్లో వారికి చోటివ్వని తాలిబన్లు.. క్రమంగా విద్య, ఉద్యోగ తదితర రంగాల్లోనూ కట్టడి చేస్తున్నారు. తాజాగా కాబుల్ నగరపాలక సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులపై ఆంక్షలు విధించారు. నగరవ్యాప్తంగా విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు ఇండ్లకే పరిమితం కావాలని తాత్కాలిక మేయర్ హమ్దుల్లా నమోనీ ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పురుషులకు అనుమతి లేని విధుల్లో ఉండే మహిళలకు మాత్రం మినహాయింపు ఉందని వెల్లడించారు. మహిళల పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ తదితర పనులు ఇందులోకి వస్తాయని చెప్పారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగుల విషయమై తుది నిర్ణయం రావాల్సి ఉందన్నారు.