Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా:కెనడాలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో లిబరల్స్లో ఉన్నారు. జస్టిన్ ట్రూడో ప్రధానిగా అధికారంలో ఉన్నారు. పార్లమెంట్ కాలపరిమితి ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉండగానే ముందస్తు ఎన్నికలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు దాదాపు 600 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రతిపక్షాలు విమరిస్తున్నాయి. ఈ డబ్బును కరోనా కట్టడికి ఖర్చు చేస్తే బాగుండేదని చెపుతున్నారు.కెనడాలో 2 కోట్ల 75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 170 సీట్లు వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటుకు అర్హత పొందుతారు. ఈ ఎన్నికలలో కరోనా కట్టడికి సంబంధించిన అంశాలే ప్రధాన అంశంగా ముందుకు వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని కరోనా కట్టడిలో ప్రశంసలు అందుకున్నందుకు ఎన్నికలలో గెలవడానికి ఇదే మంచి తరుణం అని ఆయన బావించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్టు తెలుస్తున్నది. ఎన్నికలు పోటా పోటీగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.