Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీధిలో పిజ్జా తిన్న బోల్సనారో
న్యూయార్క్: ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని దేశాధినేతలు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే న్యూయార్క్ రెస్టారెంట్లలో కూర్చుని డిన్నర్ చేయడానికి బదులుగా వీధుల్లో పిజ్జా సెంటర్లలో తినాల్సి రావచ్చు. న్యూయార్క్ చేరిన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారోకి మొదటి రోజు రాత్రి ఎదురైన అనుభవం ఇదే. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేనిదే నగరంలోని రెస్టారెంట్లలోకి రావడానికి ఆయనను అనుమతించలేదు. కరోనా వైరస్ రాకుండా తట్టుకునేంత రోగ నిరోధక శక్తి తనకు వుందంటూ వ్యాఖ్యలు చేసి న్యూయార్క్ బయలుదేరిన బోల్సనారో వ్యాక్సిన్ వేయించుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. ఆదివారం రాత్రి న్యూయార్క్ వీధుల్లో రోడ్డు పక్కన పిజ్జా తింటున్న బోల్సనారో,ఆయన సహాయకుల ఫొటోలను ప్రతినిధి బృందంలోని వారు పోస్ట్ చేశారు.కాగా,తమ నేత నిరాడంబర తను బోల్సనారో మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు. మన్హటన్ హౌటల్లో ఆయన బస చేస్తున్నారు. అక్కడకు సమీపంలోని వీధిలో పిజ్జా తింటూ ఆయన కనిపించారు. ఇక్కడకు రావడానికి ముందే అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని న్యూయార్క్ మేయర్ ముందుగానే ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేయించుకోకూడదనుకుంటే రావడం గురించి ఆలోచించవద్దని కూడా వ్యాఖ్యానించారు. కాగా సోమవారం నాటి సమావేశంలో బ్రిటీష్ ప్రదానిన బోరిస్ జాన్సన్ టీకా వేయించుకున్నారా అని ప్రశ్నించగా ఇంకా లేదని బోల్సనారో సమాధానమిచ్చారు. ప్రభుత్వ, దేశాధినేతలు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని గతవారం జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ స్పష్టం చేశారు. అయితే కొంతమంది నేతలు మాత్రం సమావేశాలకు హాజరు కాకుండా వీడియో సందేశం పంపారు. ఇదిలావుండగా, బ్రెజిల్ దౌత్యవేత్తకు న్యూయార్క్లో పరీక్షించగా పాజిటివ్ వచ్చినట్లు వార్తలందాయి. కానీ దానిపై బ్రెజిల్ రాయబార కార్యాలయం వ్యాఖ్యానించడానికి తిరస్కరించింది. దీనిపై తాము మాట్లాడుతున్నామని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు.